బాలీవుడ్ లో ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో బిగ్‌బాస్ సీజన్ 15 ముగిసిపోయింది. బాలీవుడ్‌లో ప్రముఖ టీవీ స్టార్ అయిన తేజస్వి ప్రకాష్ బిగ్ బాస్ సీజన్ 15లో విజేతగా నిలిచింది. ఇక బిగ్ బాస్ ఓటీటీ నుంచి వచ్చిన ప్రతీక్ సెహజ్ పాల్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సెలబ్రిటీల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ప్రతీక్, నిశాంత్, షమితా, తేజస్వి, కరణ్, రాఖీ, రష్మి ఫైనల్‌కు చేరుకోగా.. వీరిలో ప్రతీక్ సెహజ్ పాల్, తేజస్వి ప్రకాష్ టాప్-2గా నిలిచారు. ఎంతో ఉత్కంఠ నడుమ ను విజేతగా సల్మాన్ ఖాన్ ప్రకటించారు. బిగ్ బాస్ విజేతగా తన పేరును ప్రకటించగానే తేజస్వి ప్రకాష్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)