ఏపీలో విద్యాసంస్థలకు వేసవి సెలవుల తేదీలపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్ 30వ తేదీని ఈ అకడమిక్ ఇయర్ చివరి తేదీగా ప్రకటించిన విద్యాశాఖ.. మే 1 నుంచి జూన్ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం.. తిరిగి జూన్ 12వ తేదీ సోమవారం పాఠశాలలు వచ్చే అకడమిక్ ఇయర్‌కుగానూ పునఃప్రారంభం అవుతాయి. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)