ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేశారు. మొత్తం 150 మార్కులకు జనరల్‌ అభ్యర్థులు 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ ఏడాది టెట్‌కు 4,07,329 మంది హాజరయ్యారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)