తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఎట్టకేలకు వైస్ చాన్స్‌లర్లను ప్రభుత్వం నియమించింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను కేసీఆర్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. జాబితాను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేస్తుందని భావించగా.. సాధ్యపడలేదు. దీంతో శనివారం ప్రకటించారు.
ప్రభుత్వం నియమించిన వీసీలు వీరే..
ఓయూ వీసీగా ప్రొ. రవీందర్ యాదవ్, అంబేద్కర్ వర్సిటీ వీసీగా సీతారామరావు, తెలుగు వర్సిటీ వీసీగా కిషన్‌రావు, శాతవాహన వర్సిటీ వీసీగా ప్రొ. మల్లేశం, తెలంగాణ వర్సిటీ వీసీగా రవీందర్ గుప్తా, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా ప్రొ. గోపాల్‌రెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీగా ప్రొ. రాథోడ్, జేఎన్‌టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డి, జేఎన్ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా ప్రొ. కవిత దర్యాని, కాకతీయ వర్సిటీ వీసీగా ప్రొ. రమేష్
#JUSTIN || @TelanganaCMO declares names of vice-chancellors for 10 state universities after @DrTamilisaiGuv approves them. #OsmaniaUniversity Arts College principal Ravinder Yadav appointed as OU VC. Find out vice-chancellors appointed for other universities 👇 @TOITelangana pic.twitter.com/hDc6Mk8bDO
— TOI Hyderabad (@TOIHyderabad) May 22, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)