Newdelhi, Aug 11: గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత కే నట్వర్ సింగ్ (95) (K Natwar Singh) శనివారం రాత్రి కన్నుమూశారు. ఢిల్లీ (Delhi) సమీపంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస (Natwar Singh Passes Away) విడిచారు. నట్వర్ సింగ్ 1929లో రాజస్థాన్ లో జన్మించారు. మాజీ కాంగ్రెస్ ఎంపీ అయిన నట్వర్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు పాకిస్థాన్ రాయబారిగా వ్యవహరించారు. 1984లో ఆయనను పద్మభూషణ్ వరించింది.
Ex-External Affairs Minister Natwar Singh dies at 93 https://t.co/rIGK2lnoZQ
— IndiaTodayFLASH (@IndiaTodayFLASH) August 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)