క్రోవ్-థోర్ప్ ట్రోఫీ టోర్నమెంట్ ప్రారంభ టెస్టులో ఇంగ్లండ్ జాతీయ క్రికెట్ జట్టుతో న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో పోరాట ప్రదర్శన చేసింది. కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ అర్ధ సెంచరీలు సాధించి ఆతిథ్య జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. ఆ సమయంలో 77 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఒల్లీ పోప్‌ను అవుట్ చేయడానికి గ్లెన్ ఫిలిప్స్ గొప్ప డైవింగ్ క్యాచ్‌ అందుకున్నాడు. కుడివైపుకు డైవింగ్ చేస్తూ అందుకున్న క్యాచ్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.

ఇన్నింగ్స్ 52వ ఓవర్ లో టిమ్ సౌథీ వేసిన బంతిని ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ఓలీ పోప్ బ్యాక్ వర్డ్ పాయింట్ వైపు బాదగా... అక్కడ ఫిల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ పక్షిలా ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. సహచర ఆటగాళ్లతో పాటు మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఈ విన్యాసం పట్ల ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై గ్లెన్ ఫిలిప్స్ ను అభినందిస్తూ చప్పట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు.ఫిలిప్స్ పట్టిన ఈ క్యాచ్ తో ఓలీ పోప్ 77 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు.

పెర్త్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారీ గెలుపు, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి భారత్, రెండో స్థానానికి కంగారూలు

Glenn Phillips Catch Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)