Newdelhi, Sep 30: అధిక వేతనాలపై పెన్షన్ (Higher Pension) కు సంబంధించి ఉద్యోగుల జీతాల (Employees Salaries) వివరాల అప్ లోడింగ్ కోసం కంపెనీలకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) (EPFO) మరో మూడు నెలలు వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 31దాకా గడువు ఇచ్చింది. నిజానికి ఈ నెలాఖరుతోనే గడువు ముగిసిపోతున్నది. అయితే కంపెనీలు, ఆయా సంస్థల ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులతో ఈ ఏడాది ఆఖరుదాకా సమయమిస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి ఇంకా 5.52 లక్షల దరఖాస్తులు.. వ్యాలిడేషన్ ఆప్షన్/జాయింట్ ఆప్షన్‌ల కోసం పెండింగ్‌లో ఉన్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది.
Retirement fund body #EPFO extends the #deadline to upload details by #employers for higher pension option by 3-month till December 31
Know More: https://t.co/EC3DqJp4QD#retirement
— Zee Business (@ZeeBusiness) September 29, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)