గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ రైల్వేజోన్ పరిధిలోని ఇగత్‌పురి-లోనావాలా, కొల్హాపూర్-మిరాజ్ సెక్షన్ల మధ్య కొండచరియలు విరిగిపడటంతో 14 రైళ్లను రద్దుచేశారు.
ఈనెల 24-28తేదీల మధ్య.. నాలుగు రైళ్లు ఒక్కో రోజు, పది రైళ్లు నాలుగు రోజుల చొప్పున రద్దయ్యాయి. ఇతర రూట్లలో నడిచే ముంబయి-తిరువనంతపురం, 21, 22, 23 తేదీల్లో బయల్దేరిన వెరవల్-తిరువనంతపురం, చండీగఢ్-కొచ్చువేళి, హిస్సార్-కొయంబత్తూరుల మధ్య నడిచే రైళ్లను వర్షాల నేపథ్యంలో దారి మళ్లించి నడిపినట్లు రైల్వేశాఖ పేర్కొంది. 23న బయల్దేరాల్సిన తిరుపతి-కొల్హాపూర్, 26న బయల్దేరాల్సిన హౌరా-వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌లను రైల్వేశాఖ రద్దుచేసింది. 22, 23 తేదీల్లో బయల్దేరిన ఎర్నాకుళం-హజ్రత్ నిజాముద్దీన్, పోరుబందర్-కొచ్చువేళి, కేఎస్‌ఆర్ బెంగళూరు-అజ్మీర్ రైళ్లను దారి మళ్లించారు.
Here's South Central Railway Statement
Cancellation of Trains : Due to land slide track washed out in Igatpuri – Kasara – Karjat - Lonavala, Kolhapur-Miraj section in Central Railway the following trains are cancelled as detailed below:-@drmsecunderabad @drmhyb @drmned pic.twitter.com/FbCuEZgV0j
— South Central Railway (@SCRailwayIndia) July 23, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)