భారత వాతావరణశాఖ (IMD రైతులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో (Southwest Monsoon) దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావొచ్చని పేర్కొంది. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం (Normal Rainfall) నమోదుకావచ్చని IMD తెలిపింది.

ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు సహా వాయవ్య, దక్షిణ భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని పేర్కొంది. గత మూడేళ్లలో కూడా భారత్‌లో నైరుతి రుతు పవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య గల కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తుంటారు. ఇదిలా ఉండగా.. జూన్‌ 26-27 వరకు ఢిల్లీని రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ సమాచార ఏజెన్సీ స్కైమెట్‌ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 26 నుంచి 27 వరకు సాధారణ రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. జూలై వరకు విస్తరిస్తాయని పేర్కొంది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)