కేంద్ర ప్రభుత్వం నేడు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను 4 శాతం మేర పెంచింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 1.16 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలుగనుంది. తాజా పెంపు వల్ల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 38 శాతానికి చేరింది. ఇదివరకు డీఏ 34 శాతంగా ఉండేది. మోదీ సర్కార్ చివరిగా మార్చి నెలలో డియర్‌నెస్ అలవెన్స్‌ను డీఏ 3 శాతం మేర పెంచింది. ఈ పెంపు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు వల్ల ఉద్యోగుల వేతనాలు పెరిగే అవకాశం ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)