దేశ రాధాని ఢిల్లీలోని ఘాజీపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్‌‌(Taxi Driver) తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏండ్ల మహిళ మరణించగా, మరో ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ట్యాక్సీ డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.మృతురాలిని ఘజియాబాద్‌కు చెందిన సీతా దేవిగా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికు తరలించారు. ఘటన అక్కడున్న ఓ సీసీటీవీలో రికార్డయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. వీడియో ఇదిగో, ఐపీఎస్ అధికారి పరితోష్ పంకజ్‌ను ఢీకొట్టిన మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)