ఆగ్రాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆగ్రాలోని రాజా కీ మండి రైల్వే స్టేషన్‌లో నిలబడి ఉన్న రైల్వే కానిస్టేబుల్.. ఉన్నట్లుండి కళ్లు తిరిగి రైలు కింద (Constable falls on railway tracks from platform) పడిపోయాడు. ఇక్కడ శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రింగల్ కుమార్.. స్టేషన్‌లో ఉన్నాడు. ఒక గూడ్సు రైలు వెళ్తుండగా ప్లాట్‌ఫాంపై ఉన్నాడతను. రైలుకు సుమారు 5-6 అడుగుల దూరంలో ఉండి పరిసరాలను గమనిస్తున్నాడు. ఇంతలో ఏమైదో కళ్లు తిరిగినట్లు రెండు సార్లు తన చుట్టూ తానే తిరిగాడు.

ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి తూలుకుంటూ వెళ్లి గూడ్స్ రైలు కింద పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజి బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరణించిన కానిస్టేబుల్‌ ఉత్తరప్రదేశ్‌లోని బిజనోర్ ప్రాంతానికి చెందిన వాడని, అతనికి భార్య, ఒక నెల వయసున్న పాప ఉన్నారని సమాచారం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)