యూపీ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండే కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అనూప్ చంద్ర నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారని కేంద్ర న్యాయశాఖ మంగళవారం వెల్లడించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన సునీల్ అరోరా ఈ ఏడాది ఏప్రిల్ 12న పదవీ విరమణ చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం సుశీల్ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కాగా, రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్‌లో మొత్తం ముగ్గురు సభ్యులు ఉంటారు.
UP cadre IAS officer (retired) Anup Chandra Pandey appointed as Election Commissioner pic.twitter.com/UmpfKM6XB0
— ANI (@ANI) June 8, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)