అరుణాచ‌ల్ ప్ర‌దేశ్(Arunachal pradesh) ఇండియ‌న్ భూభాగంలోనే ఉందని, భార‌త్‌, చైనా మ‌ధ్య ఉన్న మెక్‌మోహ‌న్ లైన్‌(Macmohan line)ను అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుగా భావిస్తున్న‌ట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు అమెరిక‌న్ సేనేట్ తీర్మానం చేసింది.ప్ర‌స్తుతం ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో అత్యంత క్లిష్ట‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, ఇలాంటి ద‌శ‌లో మిత్ర దేశంతో ఇండియాకు తోడుగా ఉండాల‌ని భావిస్తున్న‌ట్లు అమెరికా సేనేట‌ర్ బిల్ హ‌గేర్టి(Senator Bill Hagerty)) తెలిపారు. సేనేట‌ర్ జెఫ్ మెర్క్లే కూడా తీర్మానం పాస్ చేసిన‌వారిలో ఉన్నారు.లైన్ ఆఫ్ యాక్చువ‌ల్ కంట్రోల్(Line of Actual Control) వ‌ద్ద చైనా సైన్యం చేస్తున్న దుశ్చ‌ర్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని, త‌మ తీర్మానం ద్వారా ఇండియాలోనే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేస్తున్నామ‌ని బిల్ హ‌గేర్టి చెప్పారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)