మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్‌ను అధికారులు మరోమారు ప్రశ్నించనున్నారు. డిసెంబర్ 21న హాజరవ్వాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ ప్రభుత్వం 2022లో నూతన మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ నవంబర్ 2న కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న ఈ కేసులో కేజ్రీవాల్‌నుసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది. ఈ కేసులో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.

మద్యం కుంభకోణంలో అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. అదే రోజు ఆయన నివాసం సహా సంబంధించిన ఆస్తులపై సోదాలు చేసింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనీస్ సిసోడియాను ఫిబ్రవరి 26న ఈడీ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)