ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది. ఓటింగ్‌ యంత్రాల్లో నిక్షిప్తమైన నేతల భవితవ్యం ఆదివారం వెల్లడి కానుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. వీటిని కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.నాలుగు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలు కానుంది.తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం 8.30గంటలకు నుంచి ఓటింగ్‌ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

Here's PTI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)