అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడగించింది. అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని జూలై 31వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు జాయింట్‌ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి ప్రభావంతో గతేడాది మార్చిలో అంతర్జాతీయ కమర్షియల్‌, ప్యాసింజర్‌ విమానాలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారి కోసం కేంద్రం ప్రత్యేకంగా వందే భారత్‌ మిషన్‌ కింద విమానాలు నడిపి, స్వదేశానికి తరలించింది. ఆ తర్వాత పలు దేశాలతో ఎయిర్‌ బబుల్‌ కింద పలు దేశాలతో జూలై నుంచి ఒప్పందాలు చేసుకొని సర్వీసులు నడుపుతోంది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో భార‌త్‌ ఎయిర్ బబుల్‌లో భాగంగా ఒప్పందాలు చేసుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)