మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్‌లో పాయిజన్ కలకలం రేగింది. చెన్నై నుంచి పుణెకు వస్తున్న భారత్ గౌరవ్ రైలులో 40 మంది ప్రయాణికుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రైలు పూణె చేరుకోగానే ప్రయాణికులకు వైద్య చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రైలు పూణే చేరుకోగానే 80 మంది ప్రయాణికుల అనారోగ్యానికి గురైనట్లు తమకు ఫిర్యాదు అందిందని పూణే రైల్వే అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఆ తర్వాత వారికి రైల్వేస్టేషన్‌లోనే ప్రథమ చికిత్స అందించి, ఆ తరువాత బాధితులను ససూన్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైలులో ఉన్న కొందరు యువకులు రైలులోని వారికి కలుషిత ఆహారం ఇచ్చారు. రైల్వేశాఖ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)