కరోనా మహమ్మారిపై సమర్థవంతంగా పోరాడేందుకు మరో వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త వ్యాక్సీన్ కార్బివ్యాక్స్ కు అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య వారి కోసమని ఆ వ్యాక్సీన్ రూపకర్త తెలిపారు. ‘బయోలాజికల్ ఈ’ అనే సంస్థ కార్బివ్యాక్స్ వ్యాక్సిన్ ను రూపొందించింది. ఈ విషయమై బయోలాజికల్ ఈ లిమిటెడ్ స్పందిస్తూ ‘‘బయోలాజికల్ ఈ లిమిటెడ్ రూపొందించిన కార్బివ్యాక్స్ వ్యాక్సిన్, దేశీయంగా రూపొందించిన మొట్టమొదటి రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్‌డీబీ) ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సీన్. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి అత్యవసర వినియోగానికి భారతదేశం యొక్క డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందింది’’ అని పేర్కొన్నారు.
Drugs Controller General of India (DCGI) grants final approval to Biological E's #COVID19 vaccine Corbevax, for children between 12-18 years of age. pic.twitter.com/2hBJpM3p40
— DD News (@DDNewslive) February 21, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)