భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కొవిడ్-19 బారిన పడ్డారు. ఎంపీ గౌతమ్ గంభీర్ కు మంగళవారం జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు. కాగా 2022 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్ ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్‌గా ఉన్నారు.తనకు కరోనా సోకినందున తనను కలిసిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని గౌతమ్ సూచించారు. ‘‘నాకు తేలికపాటి కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించగా ఈరోజు నాకు కొవిడ్‌కు పాజిటివ్ అని తేలింది. నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ స్వయంగా పరీక్షించుకోమని అభ్యర్థిస్తున్నాను. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి’’ అని గంభీర్ మంగళవారం ట్విట్టర్‌లో తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)