నవీ ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ (BMW) కార్ల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో 45 కార్లు (45 vehicles on fire) దగ్ధమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న ఎంఐడీసీ అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నవీ ముంబైలోని తుర్భే ఎంఐడీసీలోని డీ-207 బీఎండబ్ల్యూ కార్ల గోదాంలో (BMW warehouse) ప్రమాదం చోటు చేసుకుందని, మంటల్లో 40 నుంచి 45 వాహనాలు దహనమయ్యాయని అధికారులు తెలిపారు. భారీగా మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పేందుకు శ్రమించారు. 10 ఫైర్‌ టెండర్లు తరలించి దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎంత మేరకు నష్టం జరిగిందో తెలియరాలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)