ఢిల్లీ (Delhi)లోని ఓ ప్రముఖ ఫాఠశాల(Delhi School)కు బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది.మథురా రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు ఈ- మెయిల్ వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ అందులో పేర్కొనడంతో వెంటనే పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది. తక్షణమే సిబ్బంది, విద్యార్థులను అక్కడి నుంచి బయటకు పంపించింది. దీనిపై సమాచారమందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలను గుర్తించలేదు. ప్రస్తుతం ఈ-మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సరిగ్గా రెండు వారాల క్రితం కూడా ఇదే తరహాలో ఢిల్లీ పాఠశాలకు ఈ-మెయిల్ వచ్చింది.

పాఠశాల ఆవరణలో ఇంకా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పరిస్థితి సాధారణంగా ఉంది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు SWAT టీమ్ పాఠశాల భవనాలను శానిటైజ్ చేస్తున్నాయని DCP సౌత్ ఈస్ట్ రాజేష్ డియో తెలిపారు

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)