పొట్టి స్కర్టులను ధరించినంత మాత్రాన దాన్ని అశ్లీలతగా పరిగణించలేమని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ అభిప్రాయపడింది. రిసార్టుల్లో పొట్టి దుస్తులు వేసుకొని రెచ్చగొట్టే విధంగా డ్యాన్సులు చేయడాన్ని అశ్లీలతగా భావించలేమని కోర్టు తెలిపింది. మే నెలలో పోలీసులు నాగ్‌పూర్‌లోని రెండు రిసార్టులపై దాడులు చేయగా అక్కడ పొట్టి స్కర్టులు వేసుకున్న ఆరుగురు మహిళలు డ్యాన్సులు చేస్తుండడం కనిపించింది.
ప్రేక్షకుల్లో కొందరు మద్యం తాగుతూ కనిపించారు. దీన్ని అశ్లీలతగా పరిగణించిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం..ఇలాంటి వాటిని ‘పబ్లిక్ ప్లేస్’లో జరిపితేనే నేరంగా పరిగణిస్తారని తెలిపింది. రిసార్టులు, వాటిలోని బాంకెట్ హాల్‌లు పబ్లిక్ ప్లేసులు కావని పేర్కొంది. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా ప్రైవేటు ఫంక్షన్లపై పోలీసులు కేసు పెట్టలేరని స్పష్టం చేసింది. కేసును కొట్టివేసింది.
Here's Live Law Tweet
Bombay High Court Calls For "Progressive" View On Obscenity, Says Wearing Short Skirts, Dancing Provocatively Not Per Se Obscene | @CourtUnquote https://t.co/ui3Ry4h9c3
— Live Law (@LiveLawIndia) October 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)