పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతిగా తన తొలి ప్రసంగాన్ని ద్రౌపది ముర్ము..దేశానికి వినిపించారు. ఈ క్రమంలో దేశం అన్నిరంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందన్న ఆమె.. కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. మహిళా సాధికారతకు ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకారాలు అందిస్తోంది. ఇప్పుడున్నది ధైర్యవంతమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటోంది.

అందుకే తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు నమ్మకం పెరిగింది. వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ మంచి కార్యక్రమం. భారత్‌ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని తెలిపారు. ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. పొరుగు దేశాల సరిహద్దుల్లోనూ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. దేశంలో అవినీతిపై ప్రభుత్వం నిరంతరం పోరాడుతోందని తన ప్రసంగంలో కేంద్రంపై ప్రశంసలు గుప్పించారామె.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)