తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో గల ఈరోడ్ నుంచి మెట్టూరు వెళ్తున్న బస్సులో నుంచి ఓ యువతి రోడ్డుపై పడబోయింది.బస్సు ఒక్కసారిగా కుదుపు ఇవ్వగా డోర్ వద్ద ఉన్న ఆమె కదులుతున్న బస్సు నుంచి బయటకు పడబోయింది. అప్రమత్తమైన కండక్టర్ ఆమె జుట్టుపట్టుకుని బస్సులోనికి లాగాడు. బస్సు నుంచి పడకుండా (Conductor saves woman) ఆమెను కాపాడాడు. మరో ప్రయాణికురాలు కూడా సహకరించింది. అనంతరం స్టాప్ వద్ద బస్సు ఆగడంతో ఆ యువతి దిగింది. తనను కాపాడిన కండక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. ఆ బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Here's Video
Salute to the Bus Conductor 🫡 pic.twitter.com/0ZgqpgKs93
— RVCJ Media (@RVCJ_FB) February 2, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)