10, 12 తరగతుల పరీక్ష ఫలితాలకు సంబంధించి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) కీలక ప్రకటన వెలువరించింది. ఈ రెండు తరగతుల పరీక్షల ఫలితాల్లో భాగంగా ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్‌ (Distinction) ప్రకటించబోమని తేల్చిచెప్పింది. అలాగే మార్కుల శాతాన్ని కూడా పేర్కొనమని స్పష్టంచేసింది. ఒకవేళ విద్యార్థి ఐదు కంటే ఎక్కువ సబ్జెక్టులను ఎంచుకున్నట్లయితే.. వాటిలో ఐదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సదరు ఇన్‌స్టిట్యూట్‌ లేదా నియామక సంస్థ నిర్ణయం తీసుకోవచ్చు’ అని సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, పరీక్షల ఫీజు గడువు పొడిగింపును డిసెంబర్ 5 వరకు పొడిగించిన ఏపీ ప్రభుత్వం

మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం లేదా వెల్లడించడం వంటివి బోర్డు చేయదని భరద్వాజ్‌ స్పష్టం చేశారు. ఉన్నత విద్య లేదా ఉద్యోగ సమయంలో ఒకవేళ మార్కుల శాతం అవసరమైతే సదరు ఇన్‌స్టిట్యూట్‌/నియామక సంస్థ వాటిని గణించుకోవచ్చన్నారు. ఇక మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించే విధానానికి బోర్డు గతంలోనే స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)