జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో (Udhampur) గంటల వ్యవధిలో రెండు అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగిఉన్న బస్సులో పేలుగు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండో పేలుడు చోటుచేసుకున్నది. ఉధంపూర్‌లోని పాతబస్టాండ్‌లో నిలిపిఉన్న బస్సులో గురువారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు.

బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఉధంపూర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దొమాలి చౌక్‌ వద్ద ఓ బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ రెండు పేలుడు ఘటనలపై పోలీసులు, భద్రతా బలగాలు దృష్టిసారించాయి. గంటల వ్యవధిలోనే ఇవి చోటుచేసుకోవడంతో ఏమైనా ఉగ్రవాద కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)