తీవ్ర అస్వస్థతకు గురైన హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh) ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhvinder Singh Sukhu)ను ఢిల్లీలోని ఎయిమ్స్‌( AIIMS)కు తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఆయన్ను ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌(IGMCH) మెడికల్‌ సూపరింటెండెంట్‌ వెల్లడించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, అన్ని నివేదికలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు.

బుధవారం రాత్రి నుంచి అన్ని రకాల పరీక్షలు చేశాం. కడుపులో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు బయటపడింది. మరిన్ని వైద్యపరీక్షల నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాం’ అని తెలిపారు. బుధవారం రాత్రి సుఖ్విందర్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. పొత్తికడుపులో నొప్పితో ఆసుపత్రిలో చేరారు. ‘గత కొద్దిరోజులుగా సీఎం విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్నిసార్లు బయట ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. దానివల్లే ఆయన ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు’ అని సుఖు ప్రధాన మీడియా సలహాదారు వెల్లడించారు.

Heres' News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)