కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని గ్రామస్తులు మే కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’’ అని తెగేసి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బకాయిలతో సహా కరెంటు బిల్లులన్నీ కట్టాలన్న బిల్లు కలెక్టర్‌ గోపిని గ్రామస్థులు ఎదురు తిరిగారు.

ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల హామీ ఇచ్చింది గనక గ్రామస్తులు తమ కరెంటు బిల్లు చెల్లించేందుకు నిరాకరించారు. ఎన్నికల బిల్లులను ఆ పార్టీ నుంచే వసూలు చేసుకోవాలని స్పష్టం చేశారు. దాంతో చేసేది లేక ఆయన వెనుదిరిగాడు. కాగా అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)