ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీని (PM Modi on Congress) ఏకిపారేశారు. ఆ పార్టీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఏయే అంశాల‌పై పోరాటం చేయాల‌న్న జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు లేద‌ని మోదీ (PM Modi) విమ‌ర్శించారు. కాంగ్రెస్ స‌భా ప‌క్ష నేత అధిర్ రంజ‌న్ చౌద‌రికి మోదీ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. రాష్ట్ర‌పతి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై లోక్‌స‌భ‌లో మోదీ మాట్లాడారు. మోదీ ప్ర‌సంగాన్ని కాంగ్రెస్ స‌భాప‌క్ష నేత అధిర్ రంజ‌న్ చౌద‌రి అడ్డుకున్నారు. దీంతో అధిర్ రంజ‌న్‌పై మోదీ సెటైర్ వేశారు.

కొంద‌రు ఇంకా 2014లోనే ఉన్నార‌ని అధిర్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. 1972లో చివ‌రిసారిగా బెంగాల్‌లో కాంగ్రెస్ (Congress) గెలిచిందంటూ అధిర్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చినా కూడా అక్క‌డి ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వ‌లేదు. ఎన్ని ఓట‌ములు ఎదురైనా కాంగ్రెస్ నేత‌ల తీరు మాత్రం మార‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. వందేండ్ల వ‌ర‌కు కాంగ్రెస్ అధికారంలోకి రాదు (Congress doesn't intend to come to power) అని మోదీ స్ప‌ష్టం చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)