కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,371కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 4,44,77,272 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ఇక భారత్‌లో కరోనా సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 (JN.1) కేసులు 200 దాటాయి. ఇప్పటి వరకూ జేఎన్‌.1 కేసులు 263కు చేరినట్లు ఇండియన్ సార్స్‌ కోవ్‌ 2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) మంగళవారం వెల్లడించింది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్‌ విస్తరించిందని పేర్కొంది.

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)