దేశవ్యాప్తంగా 18 ఏళ్ల వయసు నిండినవారందరికీ ఇక నుంచి బూస్టర్ డోసును ఇవ్వనున్నారు. ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో ఆ టీకాలు అందుబాటులో ఉంటాయి. ఈనెల 10వ తేదీ నుంచి బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. అయితే బూస్టర్ డోసు తీసుకోవాలనుకునే 18 ఏళ్లు దాటినవాళ్లు అమౌంట్ చెల్సించాల్సి ఉంటుంది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, 60 ఏళ్లు దాటిన వాళ్లకు తొలుత బూస్టర్ డోసు ఇచ్చారు. కానీ 60 ఏండ్లలోపు వాళ్లకు మాత్రం బూస్టర్ డోసును ఉచితంగా ఇవ్వడం లేదు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా ఫస్ట్, సెకండ్ డోసులను ఉచితంగా ఇచ్చారు. హెల్త్‌కేర్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన వారికి కూడా ప్రికాషన్ డోసును ఉచితంగా ఇచ్చారు. ఇప్పటి వరకు 15 ఏళ్లు దాటిన వారిలో 96 శాతం కోవిడ్ టీకా తీసుకున్నారు.
The ongoing free vaccination programme through government vaccination centres for first and second dose to the eligible population as well as precaution dose to healthcare workers, frontline workers and 60+ population would continue and would be accelerated: Health Ministry
— ANI (@ANI) April 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)