COVID-19 Sub-Variant JN.1: దేశంలో కరోనా మళ్లీ పుంజుకుంటోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 335 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు. వారిలో నలుగురు కేరళలోనే (Kerala) ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 1,701 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,04,816) దాటింది. వీరిలో 4.46 కోట్ల మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వల్ల 5,33,316 మంది మరణించారని తెలిపింది.
దీంతో దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు చెప్పింది. కాగా, కేరళలో జేఎన్-1 (JN.1) అనే కొత్త కరోనా వేరియంట్ బయటపడిన విషయం తెలిసింది. దీనివల్ల 73 ఏండ్ల మహిళ సహా నలుగురు మరణించగా, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చనిపోయారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Here's News
India on Sunday logged 335 fresh Covid-19 infections and the number of active cases rose to 1,701, according to the Union Health Ministry.
Five deaths were reported -- four alone in Kerala, where the Covid sub-variant JN. 1 was detected, and one in Uttar Pradesh, the Health… pic.twitter.com/kkqd419UhB
— IndiaToday (@IndiaToday) December 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)