దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,086 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 18శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. నిన్న 16వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి. తాజాగా 12,456 మంది బాధితులు కోలుకోగా.. మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.14లక్షల మార్క్‌ను దాటింది. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,31,650కు చేరింది.
ఇందులో 4,28,91,933 మంది కోలుకోగా.. 5.25లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,14,475 యాక్టివ్ కేసులు కేసులున్నాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.90శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. 24గంటల్లో 4,51,312 పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 86.44కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 198.09 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.
COVID-19 | India reports 13,086 fresh cases, 12,456 recoveries and 24 deaths in the last 24 hours.
Active cases 1,13,864
Daily positivity rate 2.90% pic.twitter.com/czRzY7htFi
— ANI (@ANI) July 5, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)