COVID-19 Vaccination in MP: 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్, సంచలన నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మే 1 నుండి అమల్లోకి..

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రజలందరికీ కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ప్రకటించారు.

COVID-19 Vaccination in MP: 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్, సంచలన నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మే 1 నుండి అమల్లోకి..
Madhya Pradesh CM Shivraj Singh Chouhan | File Image | (Photo Credits: PTI)

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రజలందరికీ కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ప్రకటించారు. కాగా మే 1 నుండి COVID-19 టీకా యొక్క సరళీకృత మరియు వేగవంతమైన మూడవ దశ వ్యూహాన్ని కేంద్రం సోమవారం ప్రకటించింది. ఈ దశలో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పొందడానికి అర్హత ఉంటుంది. రాష్ట్రంలో మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 12,727 కేసులు న‌మోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,704కు చేరింది. ఇందులో 4713 మంది మ‌ర‌ణించారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 21, 2021 05:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).