కరోనా టీకా వేసుకోవాల‌ని ప్ర‌జ‌ల్ని ఒత్తిడి చేయ‌వ‌ద్దు అని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ విధానం అసంబ‌ద్ధంగా ఉంద‌ని అన‌లేమ‌ని సుప్రీం తెలిపింది. కోవిడ్‌19 వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ర్ప‌రిణామాల‌ గురించి కేంద్రం డేటాను రిలీజ్ చేయాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించిన ఆంక్ష‌ల‌ను కోర్టు త‌ప్పుప‌ట్టింది. వ్యాక్సిన్ వేసుకోని వారిని ప‌బ్లిక్ ప్ర‌దేశాల‌కు రానివ్వ‌క‌పోవ‌డం స‌రిగా లేద‌ని కోర్టు తెలిపింది. అలాంటి నిర్ణ‌యాలు తీసుకున్న ప్ర‌భుత్వాలు వెంట‌నే వాటిని ఎత్తివేయాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు కోరింది. వ్యాక్సినేష‌న్ విష‌యంలో ప్ర‌భుత్వం ఓ విధానాన్ని రూపొందించి, ప్ర‌జా సంక్షేమం కోసం కొన్ని ష‌ర‌తుల‌ను అమ‌లు చేయాల‌ని కోర్టు త‌న తీర్పులో చెప్పింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)