దేశంలో కరోనా కేసులు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం 17 వందలకు పైగా కేసులు నమోదవగా, తాజాగా 1,549 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,09,390కి చేరాయి. ఇందులో 4,24,67,774 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,510 మంది మృతిచెందగా, 25,106 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కొత్తగా 31 మంది మరణించారని, 2652 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 1,81,24,97,303 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
COVID19 | India logs 1,549 new cases & 31 deaths in the last 24 hours; Active caseload stands at 25,106
Total vaccination: 1,81,24,97,303
(Representative image) pic.twitter.com/iv0NRQKLs0
— ANI (@ANI) March 21, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)