దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ముందు రోజు 2,745గా ఉన్న కేసుల సంఖ్య మరోసారి మూడు వేలను దాటింది. గత 24 గంటల్లో 3,712 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో మహారాష్ట్ర, కేరళ నుంచే రెండు వేలకు పైగా కేసులు వచ్చాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 739 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 2,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఐదుగురు చనిపోయారు.

ఇక దేశంలో ప్రస్తుతం 19,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 8.4 శాతానికి పెరిగింది. క్రియాశీల రేటు 0.05 శాతంగా, రికవరీ రేటు 98.74 శాతంగా ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4.31 కోట్లను దాటింది. మరోపక్క, 4,26,20,394 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,24,641 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 1.94 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 12,44,298 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)