దేశంలో మంగళవారం 3714 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు ( Covid in India) చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు (COVID19 In Inida) యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1881 మంది డిశ్చార్జీ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1881 కేసులు ఉన్నాయి. ఇందులో 1242 కేసులు ముంబైకి చెందినవేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కేరళలో 1494, ఢిల్లీలో 450, కర్ణాటకలో 348, హర్యానాలో 227 కేసులు ఉన్నాయి.
కాగా, రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 0.07 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.72 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నదని తెలిపింది.
#COVID19 | India reports 5,233 fresh cases, 3,345 recoveries, and 7 deaths in the last 24 hours.
Total active cases are 28,857 pic.twitter.com/2tFODtK1se
— ANI (@ANI) June 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)