దేశంలో 18 ఏళ్లు పైబ‌డ్డ వారంద‌రూ బూస్ట‌ర్ డోస్ తీసుకోవాలంటూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 10 నుంచి ప్రైవేట్ కేంద్రాల్లో బూస్ట‌ర్ డోస్ పంపిణీని మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన కేంద్రం.. సీనియ‌ర్ సిటిజ‌న్లు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు ఉచితంగానే బూస్గ‌ర్ డోస్‌ను ప్ర‌క‌టించింది. మిగిలిన వారంతా బూస్ట‌ర్ డోస్ కోసం డ‌బ్బు చెల్లించాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ త‌యారీ సంస్థ సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్.. తన బూస్ట‌ర్ డోస్ ధ‌ర‌ను ప్ర‌క‌టించింది. బూస్ట‌ర్ డోస్‌లో కోవిషీల్డ్‌ను రూ.600కు అందించ‌నున్న‌ట్లు సీర‌మ్‌ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కాసేప‌టి క్రితం ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)