ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఢిల్లీ కోర్టు (Delhi court ) సమన్లు జారీ చేసింది. మార్చి 16న తమ ముందు హాజరుకావాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (money laundering case)లో ఢిల్లీ సీఎంకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate ) అధికారులు ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరుకావాలని కోరితే ఈడీ సమన్లు కేజ్రీ పట్టించుకోలేదు. వరుసగా ఆరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని ఆప్ స్పష్టం

ఈ నేపథ్యంలోనే ఈడీ బుధవారం కోర్టును ఆశ్రయించింది.సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది. ఈ అంశంపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది.మద్యం కుంభకోణంలో విచారణకు కేజ్రీవాల్‌ ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. మార్చి 12 తర్వాత కొత్త తేదిని ఇవ్వాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు.

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)