2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు చేసింది. రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది. బాలకార్మిక చట్టాలను కచ్చితంగా పాటించాలని.. ఈ విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తున్నట్లు వెల్లడించింది. ప్రచార కార్యక్రమాల్లో నేతలు చిన్నారులను ఎత్తుకోవడం, వాహనాల్లో తీసుకెళ్లడం కూడా నిషేధమని ఈసీ తెలిపింది.
ఎన్నికల సంబంధిత పనులు, కార్యకలాపాల్లో చిన్నారులను చేర్చుకోవద్దని ఎన్నికల అధికారులు, యంత్రాంగానికి కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల యంత్రాంగం ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. బాల కార్మిక చట్టాలు, నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూసుకునే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేసింది.
Here's News
Don't Use Children In Election Campaign: Poll Body To Political Parties https://t.co/vWq7uW67r2 pic.twitter.com/9M6xTZK4vC
— NDTV (@ndtv) February 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)