శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషణ (41) భార్యాపిల్లల ముందే దారుణహత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అంబలంగోడాలోని అతడి నివాసంలో ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. హత్యకు పాల్పడ్డ దుండగుడిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు చేస్తున్నారు. దీనిని ముఠా కక్షలుగా భావిస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు అన్వేషిస్తున్నట్టు శ్రీలంక పోలీసు అధికారులు వెల్లడించారు. నిరోషణ 2002లో శ్రీలంక అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అండర్ -19 జట్టుకు నిరోషణ సారధ్యం వహించినప్పుడు ఏంజెలో మాథ్యూస్, ఉపుల్ తరంగ, ఫర్వీజ్ మహరూఫ్ జట్టులో ఉన్నారు. చితక్కొట్టిన యశస్వీ జైశ్వాల్, జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ, టీ-20 సిరీస్ భారత్ కైవసం
Here's News
Former Sri Lanka U-19 Captain Dhammika Niroshana Shot Dead, Police Suspect Gang Rivalry@OfficialSLC #SriLanka #srilankacricket https://t.co/uNv5WZrzmp
— LatestLY (@latestly) July 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)