భారతదేశంలో G 20: తొలిసారి భారత్ చేపడుతున్నప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని ముస్తాబవుతోంది. ప్రపంచ దేశాధినేతలు ఒక్కొక్కరిగా ఢిల్లీ చేరుకున్నారు. దేశాధినేతలు బసచేసే హోటళ్ల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 (G20 Summit) సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు దేశాధినేతలు ఇప్పటికే హస్తిన చేరుకోగా, వీఐపీలు, ప్రముఖులు సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ బాటపట్టారు.
18వ జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు.సెప్టెంబర్ 9-10న భారత్ మండపంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీలో అడుగుపెట్టిన గుటెరస్‌కు నృత్య కళాకారిణులు జానపద నృత్యం చేస్తుండగా ఘన స్వాగతం లభించింది. సదస్సు ముగిసే క్రమంలో జీ20 ఢిల్లీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు.
Here's Video
G 20 in India | UN Secretary-General António Guterres arrives in Delhi for the G 20 Summit.#G20India2023 #G20SummitDelhi #G20Delhi pic.twitter.com/ylhJuChYht
— JAMMU LINKS NEWS (@JAMMULINKS) September 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)