బిజినెస్ టైకూన్ గౌత‌మ్ ఆదానీ ఇప్పుడు ప్ర‌ప‌చంలో అత్యంత సంప‌న్నుల జాబితాలో మూడ‌వ స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ డేటా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఆయ‌న ఆస్తులు సుమారు 137 బిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌పంచంలో టాప్ ప్లేస్‌లో ఉన్న కుబేరుల్లో ఎల‌న్ మ‌స్క్‌, జెఫ్ బేజోస్ ఉన్నారు. ఆ త‌ర్వాత స్థానంలో 60 ఏళ్ల బిజినెస్ టైకూన్ గౌత‌మ్ అదానీ నిలిచారు.

టెస్లా చీఫ్ ఎల‌న్ మ‌స్క్ ఆస్తులు 251 బిలియ‌న్ల డాల‌ర్లు కాగా, అమెజాన్ ఫౌండ‌ర్‌, సీఈవో జెఫ్ బేజోస్ ఆస్తుల విలువ 153 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉన్న‌ట్లు బ్లూమ్‌బ‌ర్గ్ పేర్కొన్న‌ది. ఫ్రెంచ్ వ్యాపార‌వేత్త లూయిస్ విటాన్ వ్య‌వ‌స్థాప‌కుడు బెర్నార్డ్ అర్నాల్ట్ ను దాటేసి అదానీ మూడ‌వ స్థానానికి చేరుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)