బ్లూమ్ బెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌లు ఒక్క రోజులోనే సుమారు 25 మిలియన్ డాలర్ల సంపదను (2 లక్షల కోట్లు) కోల్పోయారు. సోమవారం స్టాక్ మార్కెట్లలో అదానీ, ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీల షేర్లు పతనం కావడంతో ఈ భారీ మొత్తం నష్టపోయారు.
గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ అండ్ అదానీ టోటల్ గ్యాస్ షేర్లు క్రాష్ అవ్వడంతో అదానీ ఒక్కరోజులోనే సుమారు రూ.78,913 కోట్ల నష్టం వాటిల్లింది. ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం..ఎలాన్ మస్క్ సుమారు రూ.1.26లక్షల కోట్లు నష్టపోయినట్లు తేలింది. టెస్లా షేర్ల పతనంతో కార్ల తయారీ సంస్థ మార్కెట్ విలువ 71 బిలియన్ డాలర్లు క్షీణించిందని రాయిటర్స్ నివేదించింది.
As per reports, #GautamAdani and #ElonMusk suffered losses after their companies' shares tanked on the stock markets on Monday.https://t.co/UNJzqH08VD
— IndiaToday (@IndiaToday) October 4, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)