తమిళనాడు రాష్ట్రంలో నిన్న ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో (IAF Helicopter Crash) సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్, ఆయన భార్య, మరో 11 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌నపై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ (Shiv Sena MP Sanjay Raut) పలు ప్రశ్న‌లు లేవనెత్తారు. ఈ ఘ‌ట‌నపై ప్రజ‌ల మ‌న‌సుల్లో ప‌లు ప్ర‌శ్న‌లు మెదులుతున్నాయ‌ని అన్నారు. అత్యంతాధునిక‌, సుర‌క్షితమైన హెలికాఫ్ట‌ర్‌లో దేశ సుప్రీం క‌మాండ‌ర్ ప్ర‌యాణిస్తుంటే ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌ని రౌత్ ప్ర‌శ్నించారు. ఇది అత్యంత దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌ని, దేశ సుప్రీం క‌మాండ‌ర్ సుర‌క్షిత‌మైన ఆధునిక హెలికాఫ్ట‌ర్‌లో ప్ర‌యాణిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌ని, టాప్ క‌మాండ‌ర్‌ను ప్ర‌మాదంలో ఎందుకు కోల్పోయామ‌ని ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయ‌ని శివ‌సేన ఎంపీ గురువారం ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)