New Delhi, JAN 06: ప్రపంచమంతా ఆర్ధిక (Economy) మాంధ్యం భయాల్లోకి వెళ్లిపోయింది. దీంతో వీలైనంత తక్కువ నష్టంతో బయటపడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి ప్రపంచదేశాలు. గతకొన్నేళ్లుగా భారత వృద్ధిరేటు అనుకున్నంత ఆశాజనకంగా లేదు. అయితే తాజాగా మాంధ్యం భయాలతో ఇది మరింత దిగజారే అవకాశం ఉందని అంచనాలు వెడువడుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) ప్రకారం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. వచ్చే ఆర్ధిక సంవత్సరం ఇది 6.1 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా చెప్తోంది. దేశ వృద్దిరేటు 7శాతంగా ఉంటుందని అంచనాలు విడుదల చేసింది. నేషనల్ స్టాటటికల్ ఆర్గనైజేషన్ (National Statistical Organisation) ప్రకారం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిరేటు 7శాతం ఉంటుందని తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)