ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకుంది . అక్కడ గౌర్‌ సిటీ (Gaur City) 16 అవెన్యూలోని రెండు ఫ్లాట్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

Here's Fire Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)