హర్యానాలో (Haryana) నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాముడి వేషం ధరించిన ఓ బాల కళాకారుడి పాదాలకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (Manohar Lal Khattar) నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కర్నల్‌ నగరంలోని మైదానంలో జెండా వందనం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కొందరు చిన్నారులు రాముడు, సీత, లక్ష్మణుడిగా వేషాలు వేశారు. వేదికపై ఉన్న సీఎం అది గమనించి వారి దగ్గరికి వెళ్లి రాముడి వేషధారి పాదాలను తాకారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఈ జగత్తులో ప్రతిచోటా ఉండే శ్రీరాముడికి నమస్కారం. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈ బాల కళాకారుల ప్రదర్శనకు పరవశించి భావోద్వేగానికి గురయ్యాను. దాన్ని కట్టడి చేసుకోలేక రాముడి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాను’’ అంటూ ఖట్టర్ ట్విట్టర్లో తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)